కాకినాడ: భర్త ఉండగానే ప్రియుడిని పెళ్లి చేసుకొంది వివాహిత. భర్తను అడ్డు తొలగించుకొనేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది.ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ గొడారిగుంట దుర్గానగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి లారీ డ్రైవర్‌ నక్కా బ్రహ్మానందం అలియాస్ బ్రహ్మాజీ ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

బ్రహ్మాజీ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరదలు మంగలక్ష్మిని ఆయన పెళ్లి చేసుకొన్నాడు. ఈ దంపతులకు పాప, బాబు ఉన్నారు. మంగలక్ష్మి కాకినాడ కార్పోరేషన్ లో పారిశుద్య కార్మికురాలిగా పనిచేస్తోంది. 

అల్లవరం మండలం సావరంపేటకు చెందిన ఈతకోట సూర్యప్రకాష్‌ అనే సూర్య డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌ అవుదామని కాకినాడలో ట్రైనింగ్‌కు వచ్చాడు.శిక్షణను మానేసి కాకినాడ కార్పోరేషన్ లో పారిశుద్య సూపర్ వైజర్ గా  పనిచేస్తున్నాడు.

Also read:ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు పిసికి చంపిన భార్య

దరిమిలా మంగలక్ష్మి, సూర్యప్రకాష్ మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో మంగలక్ష్మి ఇంటి పక్కనే అద్దెకు దిగాడు. మూడు నెలల క్రితం మంగలక్ష్మి సూర్యప్రకాష్ తాళి కూడ కట్టాడు. వీరికి భర్త అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. 

సూర్యప్రకాష్ సెలవు పెట్టి స్వంతూరికి వెళ్లాడు. బ్రహ్మజీని హత్య చేసేందుకు గాను ఈ నెల 18వ తేదీన రెక్కీ నిర్వహించాడు.  ఈ నెల 19వ తేదీన మంకీ క్యాప్, చేతులకు గ్లౌస్ , స్వెట్టర్ ధరించి బ్రహ్మాజీ ఇంట్లో ప్రవేశించాడు. బ్రహ్మాజీ హత్యకు మంగలక్ష్మి సహకరించింది. దీంతో బ్రహ్మాజీ మృతి చెందాడు. సూర్యప్రకాష్ తన డైరీలో  మంగ వెడ్స్ సూర్య అని రాసుకొన్నాడని పోలీసులు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.