నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు క్రాంతినగర్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇటీవల మాగుంట లేఅవుట్లో స్పా సెంటర్ లో సాగుతున్న వ్యభిచారం గుట్టును కూడా పోలీసులు విప్పారు. తాజాగా క్రాంతి నగర్ లో సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయాన్ని బయటపెట్టారు 

సెలూన్ మీద దాడి చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. నెల్లూరు అరవింద్ నగర్ ఎక్స్ టెన్షన్ కు చెందిన సుధాకర్ రాజు బొల్లినేని ఆస్పత్రి సమీపంలోని క్రాంతినగర్ స్కూల్ సమీపంలో ప్లాటినం సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ ముసుగులో మసాజ్ కేంద్రంతో పాటు వ్యభిచార గృహాన్ని కూడా నడుపుతున్నాడని పోలీసులు చెప్పారు.

కోల్ కతా, ముంబై, తదితర నగరాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి వారితో రహస్యంగా సెలున్లో వ్యభిచారం చేయిస్తున్నాడు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడం ప్రారంభమైంది. విషయం బయటకు పొక్కకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

సెలూన్లో వ్యభిచారం సాగుతుందనే సమాచారం అందడంతో దుర్గామిట్ట ఇన్ స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ తన సిబ్బందితో నిఘా పెట్టారు. గురువారంనాడు సెలూన్ మీద దాడి చేశారు. సెక్స్ వర్కర్, విటుడు, స్పా సెంటర్లో పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సెక్స్ వర్కర్ ను హోంకు తరలించారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.