స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టుని పోలీసులు రట్టు చేశారు. గత ఆరు నెలలుగా ఈ వ్యభిచారం దందా చేస్తుండగా..తాజాగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఔట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన ధనుంజయరెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం నెల్లూరు నగరానికి వచ్చాడు. మాగుంట లేఔట్ లో నివాసం ఉంటూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు. కాగా.. ఆరు నెలల క్రితం అదే ప్రాంతంలోని ప్రధాని రహదారిపై ఉన్న స్టూడియో 11సెలూన్ అండ్ స్పాను నెలకు రూ.70వేలు చెల్లించి అద్దెకు తీసుకున్నాడు.

ఆధునిక హంగులతో దానిని ముస్తాబు చేశాడు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి మసాజ్ చేస్తామంటూ ప్రచారం కల్పించాడు. అయితే.. పేరుకు మాత్రమే అది మసాజ్ సెంటర్ అని ఫోన్లో లావాదేవీలు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో.. ఈ మసాజ్ సెంటర్ కి తాకిడి రోజు రోజుకీ బాగా పెరిగిపోయింది.

చివరకు విషయం పోలీసులకు తెలిసిపోయింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి మసాజ్ సెంటర్ పై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించారు. సోమవారం వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారం అందుకున్న డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు తమ సిబ్బందితో కలిసి స్పా సెంటర్‌పై దాడి చేశారు. నిర్వాహకుడితోపాటు ఇద్దరు సెక్స్‌వర్కర్లు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. 

నిర్వాహకుడి ఫోన్‌ను పరిశీలించిన అధికారులు నిర్ఘాంతపోయారు. అందులో యువతుల అశ్లీల చిత్రాలు, కస్టమర్ల ఫోన్‌ నంబర్లు తదితరాలను గుర్తించారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి చేసు నమోదు చేశారు. సెక్స్‌వర్కర్లను హోమ్‌కు తరలించి ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.