ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా సమయంలోనూ కొందరు మాత్రం వ్యభిచార దందాలను మాత్రం నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా.. కృష్ణా జిల్లాలో ఇలాంటి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వ్యవభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

అవనిగడ్డలో బ్యూటీ పార్లర్ ముసుగులో కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఐదుగురు నిందితులు అరెస్ట్ చేశారు. విజయవాడలో దాడులు పెరగటంతో అవనిగడ్డ వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఫోన్‌లో అమ్మాయిల ఫోటోలు పంపి విటులను ఆకర్షిస్తున్నారు. 

బేరాలు కూడా ఫోన్ లోనే చెప్పడం గమనార్హం.  కాగా.. ఈ దందా గురించి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆ వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.