సులభంగా డబ్బు సంపాదించేందుకు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతిలో కొందరు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వాట్సాప్ లోనే యువతుల ఫోటోలను షేర్ చేసి మరీ విఠులను ఆకర్షించడం గమనార్హం. తిరుపతి కాల్ గర్ల్స్ పేరిట వెబ్ సైట్ నిర్వహించి మరీ విఠులను ఆకర్షించడం గమనార్హం. వాటిని చూసి ఫోన్‌ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, మొత్తం, బ్యాంక్‌ ఖాతా నంబర్‌ పంపిస్తారు.

 డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా  పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు.

వ్యభిచార గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్‌ నంబర్‌ను సైతం పెడుతున్నారు. గంటకు రూ.1000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.  

పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులు, యువతులకు డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాతోపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు, లాడ్జీలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసు కుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.