ప్రేమ పేరిట దగ్గరౌతాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి నగ్న ఫోటోలు తీసుకుంటాడు ఆ తర్వాత వాటిని చూపించి వాళ్లనే బెదిరిస్తాడు. ఈ సంఘటన గుంటూరు లో చోటుచేసుకోగా.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇటీవల.. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఇలాంటి వేధింపులే వచ్చాయి. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికులను కలవరపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రేమ పేరుతో శివానంద్ అనే యువకుడు యువతులను మోసం చేస్తున్న వైనం వెలుగు చూసింది. నిందితుడు శివానంద్ యువతుల నగ్న చిత్రాలు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బాధిత యువతులను శివానంద్ బెదిరింపులకు పాల్పడ్డాడు. 

అయితే ఈ వ్యవహారంలో శివానంద్‌కు ఇద్దరు పోలీసులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. శివానంద్ వేధింపులు రోజు రోజుకు మితిమీరడంతో బాధిత యువతి నేరుగా జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఎస్పీ శివానంద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

 నరసరావుపేట టూటౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివానంద్‌తో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపైనా కేసు నమోదు చేశారు. శివానంద్ నూజెండ్ల మండలం జంగాలపాడు వాసిగా గుర్తించారు.