ఇటీవల మండపేటలో ఓ దళిత విద్యార్థినిపై నలురురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె స్నేహితుడిని కొట్టి మరీ సదరు విద్యార్థినిపై ఘాతుకానికి పాల్పడ్డారు. కాగా.. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇప్పనపాడు గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు అడ్డగించారు. ఆమె స్నేహితుడిని చితకబాది యువతిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు మండపేట పోలీసులను ఆశ్రయించింది.

Also Read మండపేటలో స్నేహితుడిని చితకబాది డిగ్రీ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్...

కాగా...తాజాగా పోలీసులు యువతిపై దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మండపేట పట్టణానికి చెందిన వల్లూరి మురళీకృష్ణ, సుంకర వెంకన్న, మొలకల వీరబాబు, చామంతి మధు లను నిందితులుగా పోలీసులు గుర్తించారు.

తొలుత ప్రధాన నిందితుడు వల్లూరి మురళీకృష్ణ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టగా, ఆ తర్వాత సుంకర వెంకన్న లైంగికదాడికి పాల్పడ్డాడు. ములకల వీరబాబు సంఘటన స్థలంలోనే ఉండి యువతి కాళ్లను గట్టిగా పట్టుకుని వారికి సహకరించాడు. 

వదిలిపెట్టమని విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా వారు లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. రాత్రి ఎనిమిది గంటల సమయం కావడం, రోడ్డు నుంచి పొలాల్లోకి దూరంగా తీసుకువెళ్లిపోవడంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. తర్వాత స్పృహ కోల్పోయిన బాధితురాలు తర్వాత ఎప్పటికో ఇంటికి చేరుకుంది.

తొలుత ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పే ధైర్యం చేయలేకపోయిన బాధితురాలు తర్వాత నిందితులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.