Asianet News TeluguAsianet News Telugu

16న భేటీ: బీజేపీతో కలిసి జగన్ పై పోరుకు పవన్ కల్యాణ్ వ్యూహరచన

బీజేపీతో కలిసి పనిచేసేందుకు జనసేనాని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 16వ తేదీన పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. 

Pawan Kalyan will meet bjp leaders on Jan 16 in vijayawada
Author
Amaravathi, First Published Jan 14, 2020, 6:40 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి చెక్ పెట్టేందుకుగాను బీజేపీ పావులు కదుపుతోంది. పవన్ కళ్యాణ్‌తో కమలం చేతులు కలిపింది. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. కమలం, జనసేన నేతలు ఈ నెల 16వ తేదీన సమావేశం కానున్నారు.

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ నెల 16న విజయవాడలో సమావేశమౌతారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు.

చాలా కాలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలతో పవన్ కళ్యాణ్ టచ్‌లో ఉన్నారు.  గత ఏడాది విశాఖలో ఇసుక కొరతను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంట్ మార్చ్ తర్వాత హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశారనే విషయంలో గోప్యత పాటించారు.ఈ నెల 11వ తేదీన ఢిల్లీకి వెళ్లిన  పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన ఢిల్లీ నుండి నేరుగా కాకినాడకు చేరుకొన్నారు. 

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

మూడు రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.  ఢిల్లీలో సంఘ్ పరివార్ అగ్ర నేతలతో భేటీ తర్వాత ఈ నెల 16న విజయవాడలో ఈ రెండు పార్టీల మధ్య జరిగే భేటీ  ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

Also read:పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన మద్దతును ప్రకటించింది.

2014 ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ కూటమికి జనసేన దూరమైంది. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. కేవలం ఒక్క  ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే జనసేన పరిమితమైంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, జనసేన, లెఫ్ట్, బీజేపీలు వ్యతిరేకిస్తున్నాయి. సీపీఐ, టీడీపీ జేఎసీలో భాగస్వామ్యంగా అమరావతి కోసం పోరాటం చేస్తున్నాయి.జనసేన, బీజేపీ వేర్వేరుగా పోరాటం సాగిస్తున్నాయి 

ఈ తరుణంలోనే బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ సై అన్నారు.ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం లేకపోలేదు. ఏపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

 ఈ క్రమంలోనే టీడీపీతో పాటు ఇతర పార్టీల నుండి కీలక నేతలను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలో చేరారు. భవిష్యత్తులో కూడ మరికొందరు నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరో వైపు ప్రజా ఆకర్షణ గల పవన్ కళ్యాణ్‌ తమతో కలిసి రావడం వల్ల రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని కమల దళం భావిస్తోంది. ఏపీ రాష్ట్రంలో రాజకీయాల్లో కులాల ప్రభావం కూడ ఎక్కువగా ఉంటుంది.పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడ ఏపీలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల వరకే బీజేపీతో జనసేన పొత్తులు ఉంటాయా భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడ కొనసాగుతాయా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఈ నెల 16వ తేదీన ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ మైత్రికి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios