ప్రత్యేక ఉద్యమాలు: నారా లోకేష్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన పవన్ కల్యాణ్

Pawan Kalyan replies to Nara Lokesh
Highlights

తనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. 

విశాఖపట్నం: తనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమంటూ పవన్ కల్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని నారా లోకేష్ గురువారం గుడివాడలో వ్యాఖ్యానించారు. దానికి పవన్ కల్యాణ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

వెనకబాటుతనంతో ఉద్యమాలు వస్తాయంటే రెచ్చగొట్టడమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం ఐటి రంగంలో స్థానికులకు ఉద్యోగాలు లేవని అన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టవున్ కు 25 ఎకరాల భూమి ఎందుకు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదా తేలేని చంద్రబాబు ప్రభుత్వం కాలుష్యాన్ని కూడా అరికట్టలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. రుషికొండ నుంచి చూస్తే విశాఖపట్నం కేప్ టౌన్ మాదిరిగా కనిపిస్తోందని అన్నారు. లక్ష ఉద్యోగాలన్న ప్రభుత్వం రెండు, మూడు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. 

టికెట్లు ఆశించి జనసేనలోకి రావద్దని పవన్ కల్యాణ్ అన్నారు. మీరు ఎవరికి ఓటేసినా నేను అందరి కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు.

 

loader