కథువా నుంచి..: దాచేపల్లి ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

కథువా నుంచి..: దాచేపల్లి ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

అమరావతి: దాచేపల్లి అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. కథువా నంచి కన్యాకుమారి దాకా జరుగుతున్న అత్యాచార ఘటనల గురించి విన్నప్పుడల్లా తనతో పాటు సమాజం కూడా తీవ్ర ఆవేదనకు గురవుతోందని ఆయన అన్నారు. 

ఈ రోజు దాచేపల్లి ఘటన కూడా తన మనసును కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకు, కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

అసలు ఆడబిడ్డలపై ఇలాంటి అరాచకాలకు పాల్పడే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్ గా శిక్షించే విధానాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దానిపై దాచేపల్లిలో స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు 

పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్యను పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని మంత్రులను, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను ఆదేశించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page