Asianet News TeluguAsianet News Telugu

ఆర్మీ సంక్షేమానికి కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఆర్మీ సంక్షేమం కోసం రూ. కోటిని  గురువారం నాడు పవన్ కళ్యాణ్ అందించారు. 

Pawan Kalyan donated RS.1 crore to army welfare board
Author
New Delhi, First Published Feb 20, 2020, 1:50 PM IST

న్యూఢిల్లీ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు  సైనిక సంక్షేమ నిధికి కోటి రూపాయాలను విరాళంగా ఇచ్చాడు.  ఇవాళ ఉదయం విజయవాడ నుండి నేరుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకొన్నారు.

ఢిల్లీలోని సైనిక సంక్షేమ  కార్యాలయానికి వెళ్లి ఆయన  కోటి రూపాయాల విరాళానికి సంబంధించిన చెక్‌ను అందించారు.  గత ఏడాది డిసెంబర్ మాసంలో  పవన్ కళ్యాణ్‌కు బ్రిగేడియర్ బిగేంద్రకుమార్ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా పలువురికి ఆయన లేఖ రాశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు కూడ ఆయన ఈ లేఖను పంపారు.

ఆర్మీ సంక్షేమ నిధికి  విరాళం ఇవ్వాలని బిగేంద్ర కుమార్ ఆ లేఖలో కోరారు. గతంలో రెండు మూడు దఫాలు పవన్ కళ్యాణ్  ఆర్మీ సంక్షేమం కోసం విరాళం ఇవ్వాలని భావించారు. కానీ సాధ్యపడలేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఆర్మీ సంక్షేమం కోసం తన వంతు సాయంగా ఇవాళ కోటి రూపాయాలను అందించినట్టుగా పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించారు. జనసైనికులు, తన అభిమానులు ఆర్మీ సంక్షేమం కోసం చేతనైంత సాయం చేయాలని ఆయన కోరారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios