ఒంగోలు: కన్న కూతురును వ్యభిచారం చేయాలని ప్రోత్సహించిన కేసులో తల్లితో పాటు ఆమె ప్రియుడికి శిక్ష విధించింది ఒంగోలు కోర్టు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

ఒంగోలులో నివాసం ఉంటున్న వివాహితతో విల్సన్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. అయితే ఆ సమయంలో  వివాహితకు 13 ఏళ్ల కూతురు ఉంది. తల్లి కోసం వచ్చే సమయంలో  కూతురిపై విల్సన్ కన్నేశాడు. మైనర్ బాలికపై కూడ పలుమార్లు అతను కన్నేశాడు.

ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. కానీ, పట్టించుకోలేదు.  ఆ తర్వాత ఆ బాలికను విజయవాడలోని వ్యభిచార గృహానికి అమ్మారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత చీరాల బోడిపాలెంలోని వ్యభిచార గృహానికి అమ్మారు.

బోడిపాలెనికి చెందిన వ్యభిచార గృహం నిర్వాహకులు బాలికను వ్యభిచారం కోసం చిలకలూరిపేట వైపుకు తీసుకెళ్లే సమయంలో  ఆటో ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో స్థానికుల సహాయంతో ఆ బాలిక తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో బాలికను ఒంగోలు చైల్డ్ లైన్ కు తరలించారు. 2016లో ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేశారు. ఇరువర్గాలు తరపున కోర్టులో వాదనలు జరిగాయి. కన్నతల్లి తనకు అన్యాయం చేసిన  విషయాన్ని బాధితురాలు కోర్టులో చెప్పింది. దీంతో సోమవారం నాడు కోర్టు తీర్పు చెప్పింది.

కన్న కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన కేసులో తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి, వ్యభిచార కేంద్రం నిర్వాహకులకు పదేళ్లు చొప్పున జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది కోర్టు.