హైదరాబాద్ఏపీ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో గల నిట్ కాలేజీ మరోసారి వార్తల్లోకెక్కింది. నిట్  డైరెక్టర్  సూర్యప్రకాష్ రావు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో  అప్‌లోడ్ చేశారు ఇంటర్నేషనల్ యువజన పార్టీ నేతలుఅయితే తనపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిట్ డైరెకర్ట్ చెబుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవ్వలేదనే ఉద్దేశ్యంతోనే తనపై ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also read:విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: నిట్ డైరెక్టర్‌పై మాజీ మంత్రి మాణిక్యాలరావు

ఈ నెల 16వ తేదీన నిట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావుపై మాజీ మంత్రి  మాణిక్యాల రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి,  హెచ్ఆర్‌డీ మంత్రికి ఫిర్యాదు చేశారు. పీహెచ్‌డీ పట్టా కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక వేధింపులకు నిట్ డైరెక్టర్ పాల్పడుతున్నాడని ఆరోపణలు  వచ్చాయి. 

ఈ విషయమై కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను కూడ మాణిక్యాలరావు కిషన్ రెడ్డికి అందించారు. ఈ  ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళతో నిట్ డైరెక్టర్ సన్నిహితంగా ఉన్న వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. తనంటే గిట్టని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిట్ డైరెక్టర్ స్పష్టం చేశారు.  

 అయితే సోషల్ మీడియాలో నిట్ డైరెక్టర్ రావు వ్యవహరానికి సంబంధించి యూట్యూబ్‌లో పలు వీడియోలను అప్‌లోడ్ చేసిన విషయమై  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాలో కూడ ఈ విషయమై పెద్ద ఎత్తున కథనాలు కూడ వచ్చాయి.