ప్రధాని మోడీపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh serious comments on Modi
Highlights

ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

కాకినాడ: ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడలో చేపట్టిన ధర్మపోరాట దీక్షలో శుక్రవారం ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

తెలుగుజాతితో పెట్టుకోవద్దని ఆయన మోడీని హెచ్చరించారు. తెలుగుజాతితో పెట్టుకున్న వాళ్ళు మాడిమసైపోయారని అన్నారు. "మీరు పెట్టుకుంటే మసైపోతారు" అని  ఆయన ప్రధానిని ఉద్దేశించి అన్నారు. 

కర్ణాటక ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా 2019లో చూపించబోతున్నామని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్, జగన్ ప్రధాని మోడీని నిలదీయాలని ఆయన అన్నారు. వైసిపి ఎంపీల రాజీనామా ఓ డ్రామా అని లోకేష్ అన్నారు.

loader