పవన్ కల్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: నారా లోకేష్

First Published 28, Jun 2018, 9:25 PM IST
Nara Lokesh says Pawan Kalyan is provocing public
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.

గుడివాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఉత్తరాంధ్ర రాష్ట్ర ఉద్యమమని పవన్ కల్యాణ్ అనడం సరి కాదని అన్నారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని నారా లోకేష్ గురువారం ఆవిష్కరించారు.

ఉత్తరాంధ్రతో సహా రాష్ట్రమంతా గతంలో కన్నా ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. గౌతు శివాజీ లాంటి నాయకుడిపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం బాధ కలిగించిందని, విమర్శలు చేసే ముందు పవన్ కల్యాణ్ కాస్తా ఆలోచించాలని ఆయన అన్నారు.

కర్నూలు డిక్లరేషన్ అనే బిజెపి కర్నూలును దేశం రెండో రాజధానిగా ప్రకటించాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని అడిగారు. వెంకన్న నగలపై విమర్శలు చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

loader