Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన బాబు ఆస్తులు:ఫ్యామిలీ ఆస్తులను వెల్లడించిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు తన కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రకటించారు. 

Nara Lokesh declares assets of Chandrababu Naidu and family
Author
Amaravathi, First Published Feb 20, 2020, 3:22 PM IST


అమరావతి: చంద్రబాబునాయుడు  ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 87 లక్షలకు పెరిగినట్టుగా మాజీ మంత్రి,  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. 

గురువారం నాడు నారా లోకేష్  తమ కుటుంబానికి చెందిన ఆస్తులను అమరావతిలో ప్రకటించారు.  9 ఏళ్లుగా  తమ కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రకటిస్తున్నట్టుగా లోకేష్ గుర్తు చేశారు.

విలువలతో కూడిన  రాజకీయాలుచేయాలని తాము భావిస్తున్నామని అందుకే 9 ఏళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు.తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ రూ. 9కోట్లకు చేరిందన్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షలు పెరిగిందన్నారు.

తన తల్లి భువనేశ్వరీ ఆస్తి  రూ. 53కోట్ల 37 లక్షల నుండి రూ.50 కోట్ల 62 లక్షలకు తగ్గినట్టుగా లోకేష్ చెప్పారు. బ్యాంకు అప్పులు రూ. 22 కోట్ల నుండి రూ. 11 కోట్లకు తగ్గినట్టుగా లోకేష్ వివరించారు. గత ఏడాది తనకు నిర్వహణ్ హోల్డింగ్స్ లో షేర్స్ ఉండేవి. వాటిని తాను తన భార్య బ్రహ్మణికి గిఫ్ట్ చేసినట్టుగా లోకేష్ స్పష్టం చేశారు.

తన ఆస్తులు 27 కోట్ల నుండి రూ. 24 కోట్లకు తగ్గినట్టుగా లోకేష్ ప్రకటించారు. తన  భార్య బ్రహ్మణికి రూ. 13 కోట్ల నుండి రూ. 15 కోట్లకు పెరిగినట్టుగా లోకేష్ చెప్పారు.
 దేవాన్ష్ ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే పెరిగినట్టుగా లోకేష్ తేల్చి చెప్పారు. రూ. 18 కోట్ల 71 లక్షల నుండి రూ. 19 కోట్ల 14 లక్షలకు పెరిగిందని చెప్పారు.

తాము ప్రకటించిన ఆస్తుల కంటే  ఒక్క పైసా ఎక్కువ ఉన్నా వాటిని  రుజువు చేసిన వారికే తిరిగి ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా తాము ఇదే సవాల్‌ విసురుతున్నామని  లోకేష్ గుర్తు చేశారు.ఈడీ, సీబీఐ కాదు మీరు సంపాదించిన ఆస్తులను మీరే స్వయంగా ప్రకటించాలని లోకేష్ పరోక్షంగా సీఎం జగన్ పై సవాల్ విసిరారు.

జగన్ అవినీతి పరుడని సీబీఐ, ఈడీలు తేల్చాయని ఆయన ఆరోపించారు.  అయితే తాము కూడ అవినీతిపరులమనే ముద్ర వేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని.. ఈ క్రమంలోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios