Asianet News TeluguAsianet News Telugu

సజ్జలపై చర్యలు తీసుకోవాలి... హైకోర్టులో రఘురామ

వాదనలు వినిపించేందుకు సంబంధిత న్యాయవాది గైర్హజరు కావడంతో విచారణను వారం రోజులపాటు వాయిదా వేయాలని మరో న్యాయవాది కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.

MP Raghurama krishnama raju file case against Sajjala Ramakrishna
Author
Hyderabad, First Published Sep 9, 2021, 7:47 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించలేదని... ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

వైసీపీ, ప్రభుత్వం తరపున పత్రికా సమావేశాలు, ప్రకటనలు చేయకుండా సజ్జలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఏపీ సీఎస్ సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

వాదనలు వినిపించేందుకు సంబంధిత న్యాయవాది గైర్హజరు కావడంతో విచారణను వారం రోజులపాటు వాయిదా వేయాలని మరో న్యాయవాది కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.

కాగా... రఘురామ కృష్ణం రాజు వేసిన వ్యాజ్యంలో ఏముందంటే... ‘ సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీకి చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక సలహాదారుడిగా ఉంుటూ ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, మరో మూడు జిల్లాలకు ఇన్ ఛార్జ్ గానూ వ్యవహరిస్తున్నారు. వైసీపీ కార్యాలయం నుంచి పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ’

‘ పార్టీ తరపున ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. 2019 జూన్ 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో 131 జారీ చేస్తూ సజ్జలను ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ కేబినేట్ మంత్రి హోదా కల్పించింది. ఈ నియామకానికి పలు నిబంధనలను పేర్కొంది. సివిల్ పోస్టులో ఉంటూ... ప్రభుత్వం నుంచి జీతం, ఇతర ప్రయోజనాలు పొందుతున్న వారికి  ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయి. నిబంధన 3 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి నిర్దిష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నిర్వహిస్తున్న పోస్టుకు మచ్చతెచ్చేలా వ్యవహరించకూడదు. ప్రత్యేక సలహాదారులు తాత్కాలిక సివిల్  సర్వెంట్స్ లాంటివారు. సివిల్ సర్వెంట్ల మాదిరిగానే వీరు కూడా నిజాయితీగా.. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అంటూ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios