అమరావతి:  ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

Also read:ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఓటింగ్ విషయంలో టీడీపీ నాయకత్వానికి షాకిచ్చింది ఎమ్మెల్సీ పోతుల సునీత. పోతుల సునీతతో పాటు టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడ టీడీపీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు చేశారు.

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై  అనర్హత వేటు వేయాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌కు లేఖ అందించారు టీడీపీ సభ్యులు. దివంగత టీడీపీ నేత పరిటాల రవికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న పోతుల సురేష్ భార్యే సునీత.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

సుధీర్ఘ కాలం పాటు టీడీపీతో  ఉన్న అనుబంధాన్ని వీడి వైసీపీలో చేరాలని పోతుల కుటుంబం ఎందుకు నిర్ణయం తీసుకొందనేది  తెలియాల్సి ఉంది.