Asianet News TeluguAsianet News Telugu

జగన్ పారాసెటమాల్ కారణంగానే మూడో దశలో కరోనా.. బుద్ధా ఫైర్

కరోనా నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొందని..జగన్ మాత్రం బ్లీచింగ్ చల్లుకుని పారాసిట్మాల్ వేసుకోమని సలహాలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. దానివల్లే  వైరస్ 3దశకు చేరిందని విమర్శించారు. పరిపాలన చేతకాదన్నది రాష్ట్ర ప్రజలకు జగన్ చర్యలతో తేటతెల్లమైందన్నారు.
 

mlc buddha venkanna fire on CM YS Jagan Over Corona cases in AP
Author
Hyderabad, First Published Apr 10, 2020, 12:59 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి మండిపడ్డారు. జగన్ కారణంగానే కరోనా మూడో దశకు చేరుకుందని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుద్ధా స్పందించారు.

Also Read కరోనా వైరస్: ఏపీలో 365కు చేరుకున్న కోవిడ్ కేసులు, ఆరుగురు మృతి...

కరోనా నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొందని..జగన్ మాత్రం బ్లీచింగ్ చల్లుకుని పారాసిట్మాల్ వేసుకోమని సలహాలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. దానివల్లే  వైరస్ 3దశకు చేరిందని విమర్శించారు. పరిపాలన చేతకాదన్నది రాష్ట్ర ప్రజలకు జగన్ చర్యలతో తేటతెల్లమైందన్నారు.

 లాక్‌డౌన్ ఆంక్షలను వైసీపీ ప్రజాప్రతినిధులు ఉల్లంఘిస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. మంత్రి సురేష్‌తో పాటు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు లాక్‌డౌన్‌ని ఉల్లంఘిస్తే వారిని ఎందుకు క్వారంటైన్‌లో పెట్టలేదని ప్రశ్నించారు.

రాష్ట్రం మంచి కోసం ఈ సూచనలు పాటించండని చంద్రబాబు లేఖలు రాస్తుంటే దానినీ వైసీపీ నేతలు తప్పుబట్టడం దురదృష్టకరమని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. సంక్షోభ సమయంలోనూ సాక్షి పత్రికకు జగన్ కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios