బొండా గారి పీఏ రాసలీలలు ...

mla bonda uma pa rasaleelalu
Highlights

టీడీపీ మహిళా కార్యకర్తలతో సంబంధాలు

విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు గారి పేరు ప్రత్యర్థి నేతలను విమర్శించడంలో ఎంత బాగా వినిపిస్తుందో... ఈ మధ్యకాలంలో అంతకు మించి వివాదాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూకబ్జా ఆరోపణలతో ఆయన మీద కేసులు కూడా పెట్టారు. మరి ఎమ్మెల్యే గారే ఇంతటి పాపులారి సంపాదిస్తుంటే తానేమి తక్కువ తినలేదు అంటున్నాడు. ఆయన పీఏ. గత కొంతకాలంగా ఎమ్మెల్యే పీఏ అనే హోదాలో ఆయన ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయాని వార్తలు వస్తున్నాయి. సెటిల్‌మెంట్లతో పాటు టీడీపీ మహిళా కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో వేటికి ఆధారాలు లేకపోవడంతో ఎవ్వరూ నోరు మెదపలేదు. కానీ ఈ సారి పక్కా ఆధారాలతో దొరికిపోయాడు పీఏ గంటా మోహన్. విజయవాడ నగరంలోని వాంబే కాలనీకి చెందిన ఓ మహిళతో గంటా సన్నిహితంగా ఉన్న ఫోటోలతో కూడిన వార్తా కథనం హెచ్‌ఎంటీవీలో ప్రసారమైంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెచ్ఎంటీవీ వార్తా కథనం ప్రకారం.. తనను పక్కకుబెట్టి.. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గంటా మోహన్ భార్య గతంలో నున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో పీఏ భార్యే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

loader