ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. మైనర్ బాలికపై ఆరు నెలలుగా ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.  ఈ విషయమై బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ బాలిరెడ్డినగర్ కు చెందిన యుగంధర్  అనే వ్యక్తి తన వద్ద పనిచేసే 15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవల కాలంలో ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో వైద్యులు పరీక్షిస్తే అత్యాచారం చేసిన విషయం వెలుగు చూసినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు.ఈ విషయమూ బాలికను కుటుంబసభ్యులు నిలదీస్తే అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. 

నిందితుడిపై బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యుగంధర్ తో పాటు అతని భార్యపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.