గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కె. శ్రీలక్ష్మి నిందితుల వివరాలను వెల్లడించారు.

తెనాలిలో ముత్యంసెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత 26వ తేదీన కర్లపాలెంకు చదిన నూతలపాటి నవీన్ కుమార్ కిడ్నాప్ చేశాడు. తమ కూతురు అదృశ్యంపై బాలిక తల్లి రాత్రి తెనాలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి బాలికపై నవీన్ కుమార్ అత్యాచారం చేసి తెనాలిలోని వైకుంఠపురం సమీపంలో వదిలివెళ్లాడు. 

తల్లిదండ్రులకు భయపడి బాలిక అర్తరాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు పేరేచర్లకు చేరకుంది. బాలికకు మాయమాటలు చెప్పి పేరేచర్లకు చెందిన హోంగార్డు అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు దుర్గారావు ఆమెను కిడ్నాప్ చేశారు. బాలికను గదిలో బంధించి రెడు వారాల పాటు బాలికపై వారిద్దరు అత్యాచారం చేశారు. గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ పరిధిలో అశోక చక్రవర్తి హోం గార్డుగా పనిచేస్తున్నాడు. 

ఈ నెల 13వ తేదీిన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని తెనాలి చేరుకుంది. తల్లితో కలిసి బాలిక తెనాలి వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో బాలిక వివరాలు వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారిపై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురిని మంగళవారం అరెస్టు చేశారు. 

"