గుడివాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తన భక్తిని చాటుకున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడాలి నాని శనివారం గుడివాడ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్ లో పర్యటించారు. 

స్థానిక వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ప్రశాంత్ కుమార్-స్వాతి దంపతులు మంత్రి కొడాలి నానిని కలిశారు. ప్రశాంత్ కుమార్-స్వాతి దంపతులకు ఇటీవలే మగబిడ్డ జన్మించాడు. తమ బిడ్డకు పేరు పెట్టాలంటూ మంత్రి కొడాలి నానిని కోరారు. 

ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకున్న మంత్రి కొడాలి నాని ముద్దాడారు. బిడ్డకు జగన్మోహన్ అని పేరు పెట్టి ఆశీర్వదించారు. జగన్మోహన్ పేరు పెట్టడంతో తల్లిదండ్రులు సంబరపడిపోయారు. మంత్రి వెంట ఉన్న కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేశారు. 

అంతా జగన్మోహన్ అంటూ పిలుస్తూ సంబరపడిపోయారు. ఇకపోతే ప్రశాంత్ కుమార్ మంత్రి కొడాలి నానికి సన్నిహితుడు. స్వాతి గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ప్రత్యేక వైద్యసేవలు అందేలా చూశారు మంత్రి కొడాలి నాని ఆదేశించారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి స్వాతి డిశ్చార్జ్ అయ్యింది.

ప్రశాంత్ కుమార్ కుటుంబానికి ఎన్నోసార్లు కొడాలి నాని అండగా నిలిచారని ప్రశాంత్ తెలిపారు.  తమ బిడ్డకు ముుఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చేలా జగన్మోహన్ పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని మురిసిపోయారు ప్రశాంత్ కుమార్.