నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం ఉచ్చూరుకి చెందిన 26 ఏళ్ల యువకుడు సూళ్లూరుపేటలోని యమహా షోరూం వద్ద ఆగి ఉన్నాడు. 

నాగరాజపురానికి చెందిన దయాకర్, బాలచెన్నయ్య,వెంకటేశ్వర్లు, ఎం మహేశ్, ఎం.మస్తాన్ లు ఆ యువకుడి వద్దకు చేరుకున్నారు. ఆ యువకుడిని మాటట్లో పెట్టి ఆటోలో కిడ్నాప్ చేశారు. అక్కడ నుంచి మన్నారుపోలూరు శివార్లలోని తైలం చెట్లలోకి తీసుకెళ్లి అతడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. 

ఆ తర్వాత ఐదుగురు ఆ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఎక్కడైనా ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని అంతటితో ఆగకుండా చంపేస్తామని హెచ్చరించారు. 

అనంతరం తేరుకున్న యువకుడు సూళ్లూరుపేట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే నిందితులలో ఒకరి భార్యతో బాధితుడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రాథమిక విచారణలో తేలింది.