Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ అకౌంట్లతో 20 మంది యువతులకు ప్రేమ వల.. నగ్నఫొటోలు, వీడియోలు తీసి...

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, పేకాట, ప్రేమ, పెళ్లి ముసుగులో దగా, 126 నగ్న ఫొటోలు, వీడియోలతో రూ. 5 లక్షలు వసూలు, గంజాయి వ్యాపారం.. ఇలా అనేక విధాల మోసాలకు పాల్పడుతున్న ఓ నయవంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

man cheated 20 women with fake account, arrested in anantapur-  bsb
Author
Hyderabad, First Published Jun 4, 2021, 12:42 PM IST

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, పేకాట, ప్రేమ, పెళ్లి ముసుగులో దగా, 126 నగ్న ఫొటోలు, వీడియోలతో రూ. 5 లక్షలు వసూలు, గంజాయి వ్యాపారం.. ఇలా అనేక విధాల మోసాలకు పాల్పడుతున్న ఓ నయవంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కేజీ గంజాయి, సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నగరంలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి. సత్యయేసుబాబు వివరాలను వెల్లడించారు. నగరంలోని భైరవనగర్ లో నివాసముంటున్న భరత్ రెడ్డి బీటెక్ మూడో సంవత్సరం వరకు చదివి, ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిసయ్యాడు.

అనుమానం : భార్యను గొడ్డలితో నరికి చంపి, కొడుకు మీద కూడా దాడి... !...

అందుకు సరిపడా డబ్బులు, సంపాదన లేకపోవడంతో కొత్త పంథా ఎంచుకున్నాడు. ఫేస్ బుక్, టిండర్ యాప్, తెలుగు మ్యాట్రిమోనిలలో ఫేక్ ఐడీలో అకౌంట్లు సృష్టించాడు. వీటిలో భరత్ రెడ్డి పేరుకు బదులుగా సిద్ధార్థ రెడ్డి అని పేరు. అతని ఫొటోకు బదులుగా ఓ అందమైన వ్యక్తి ఫొటోను ప్రొఫైల్ గా పెట్టుకున్నాడు. అలా అమ్మాయిలను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ తో మాట్లాడేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొందరు అమ్మాయిలను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి నగ్న దృశ్యాలు, రికార్డులు సేకరించాడు. 

ఇలా ఇతని చేతిలో 20 మందికి పైగా యువతులు మోసపోయారు. ఫేస్ బుక్, టిండర్ యాప్, మ్యాట్రిమోనీ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను మోసం చేశాడు. 

అమ్మాయిల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు డబ్బును తన బ్యాంకు అకౌంట్లు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రాబట్టుకున్నాడు. ఇలా సుమారు 20 మంది అమ్మాయిలు భరత్ వలలో మోసపోయారు. వీరిలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు, స్టాఫ్ వేర్ ఇంజనీర్లు కూడా ఉండడం గమనార్హం.

అమ్మాయిలు, మహిళలు స్నానం చేసే సమయంలో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. దీంతోపాటుగా గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతని మీద ఇప్పటికే అనంతపురం వన్ టైన్ లో కిడ్నాప్ కేసు, టూటౌన్ లో గ్యాంబ్లింగ్ కేసులున్నాయి. 

‘ నా రూమ్ కి వస్తావా..?’ఉపాధ్యాయుడి వేధింపులు.. ఆడియో లీక్..!...

అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న భరత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. దిశ డీఎస్పీ ఎ. శ్రీనివాసులు విచారణలో నయవంచన బాగోతం వెలుగు చూసింది. విలేకరుల సమావేశంలో ఏఎస్సీ నాగేంద్రుడు పాల్గొన్నారు. 

సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా అమ్మాయిలను వంచించడం పరిపాటిగా మారింది. వాట్సాప్ చాటింగులు, వాయిస్ కాల్స్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదమని గుర్తించాలి.

భరత్ రెడ్డి బాధితులెవరైనా ఉండే దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులను సంప్రదించండి. మహిళల చేతిలో వజ్రాయుధమైన దిశ ఎస్ఓఎస్ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలి అని ఎస్పీ బి. సత్యయేసుబాబు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios