తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడలో దారుణం జరిగింది. ఓ భర్త బరితెగించి కట్టుకున్న భార్యపై డంబెల్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

కొవ్వాడకు చెందిన శ్రీను అనే వ్యక్తి ఆర్టీసీ ఉద్యోగి. అయితే అతడు చెడు వ్యసనాలకు బానిసయి నిత్యం ఇంటికి పూటుగా తాగేసి వచ్చి భార్యను వేధించేవాడు. రెండేళ్ల క్రితం భార్య తరఫు బంధువు ఒకామె ఇంటికి వస్తే... ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో శ్రీనుపై భార్య పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ తర్వాత పోలీసుల వద్ద ప్రాధేయపడడంతో హెచ్చరించి వదిలేశారు. ఉద్యోగం పోతుందని అందరూ సర్దిచెప్పడంతో భార్య మాధవి కూడా కేసు వెనక్కి తీసుకుంది.

అయితే అప్పటి నుంచి భార్య మాధవిపై శ్రీను కక్ష పెంచుకున్నాడు. ఆమెను నిత్యం వేధించడమే కాదు కొన్ని నెలల క్రితం హత్యాయత్నం కూడా చేశాడు. అప్పట్లో బంధువులు అడ్డుకున్నారు. 

read more  తిరుపతిలో భూ వివాదాలు: ఇల్లు నాదంటూ కానిస్టేబుల్ దౌర్జన్యం

అంతేకాకుండా సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ వాటికి అలవాటుపడ్డాడు. అ క్రమంలో కన్న కూతుళ్లతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడు. చివరికి ఉన్మాదిలా మారి బుధవారం రాత్రి భార్య తలపై డంబెల్‌తో బలంగా కొట్టి తీవ్రంగా గాయపర్చాడు.  విషయం తెలుసుకున్న మాధవి బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వీడియో

"

ఇంత జరిగినా పోలీసులు తన భర్తపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని మానస ఆరోపించింది. తన భర్తకు అధికార పార్టీకి చెందిన ఓ నేత అండగా ఉన్నాడని అందుకే పోలీసులు పట్టించుకోవడం లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీను పరారీలో ఉన్నాడు.