పన్నెండేళ్ల చిన్నారిపై అక్క భర్త అత్యాచారం, గర్భందాల్చిన బాలిక...

First Published 30, Jun 2018, 12:20 PM IST
Man arrested for raping wife's 12-year-old sister in ongole
Highlights

ఒంగోలు జిల్లాలో దారుణం....

పాపం...అభం శుభం తెలియని ఓ పన్నెండేళ్ల బాలికపై సొంత అక్క భర్త కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొందంటూ బెదిరించి బాలికపై ఇలా పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే ఈ కామాంధుడి కారణంగా బాలిక గర్భం దాల్చడంతో విషయం బైటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన భానుచందర్ ఓ రెస్టారెంట్ లో పనిచేసేవాడు. ఇతడికి ఒంగోలుకు చెందిన యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే కులాలు వేరవడంతో భానుచందర్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే అత్తమామలు వీరి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు.

పెళ్లి తర్వాత భానుచందర్ అత్తవారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏడో తరగతి చదువుతన్న పన్నెండేళ్ల భార్య చెల్లిపై అతడి కన్ను పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి బాలికను లోబర్చుకున్నాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే ఈ మద్య బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. దీంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకెళ్లగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను ప్రశ్నించగా అసలు నిజాన్ని బైటపెట్టింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు దారుణారనికి అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితుడిపై అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 

loader