కేసీఆర్ గెలవాలని ఆంధ్రా అభిమాని అన్నవరంలో పూజలు (వీడియో)
5, Dec 2018, 4:26 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లతో గెలిచి, కేసీఆర్ మళ్లీ అధికారం చేపట్టాలని ఏపీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కేసీఆర్ ఫౌండేషన్ నాయకుడు దూసర్లపూడి రమణరాజు సత్యదేవుడికి వంద కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనం అర్పించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక నిర్వహించేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ముందడుగు వేయాలని సత్యదేవున్ని వేడుకున్నట్లు తెలిపారు.