Asianet News TeluguAsianet News Telugu

అయేషా మీరా తల్లి వ్యాఖ్యలపై రోజా రియాక్షన్: అండగా ఉన్న నాపై....

అయేషా మీరా ఘటన జరిగినప్పుడు రోజా హడావిడి చేశారని ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. తన కుమార్తె ఘటనలో నిందితులు రోజాకు తెలుసునని అందువల్లే ఆమె మౌనంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

Justice for Ayesha: Ysrcp mla R.K.Roja condemned Ayesh meera mother comments
Author
Amaravati Capital, First Published Dec 14, 2019, 5:06 PM IST

గుంటూరు: బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా రేప్, హత్యకేసులో ఆ కుటుంబానికి తాను అండగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే రోజా. అయేషా మీరాపై రేప్, హత్య ఘటనకు సంబంధించి తాను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చారు. 

అయేషా మీరా కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాంటి తనపై అయేషా మీరా తల్లి షంషాద్ బేగం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. 

ఇప్పటికీ ఎప్పటికీ అయేషా మీరా కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తన తాపత్రాయం అని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను పోరాటం చేస్తానని అలాంటి తనపై షంషాద్ బేగం విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. 

అయితే అయేషా మీరా రేప్, హత్య ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులు రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రముఖ చానెల్ తో మాట్లాడిన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

అయేషా మీరా హత్య కేసులో తన కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. 12 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఇప్పటికీ న్యాయం జరగలేదని ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం కూడా తనకు లేదన్నారు. 

ఇకపోతే అయేషా మీరా ఘటన జరిగినప్పుడు రోజా హడావిడి చేశారని ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. తన కుమార్తె ఘటనలో నిందితులు రోజాకు తెలుసునని అందువల్లే ఆమె మౌనంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్..

2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో అయేషా మీరాపై దారుణానికి ఒడిగట్టారు కొందరు దుండగులు. అయేషా మీరాపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. 

ఇకపోతే అయేషా మీరా హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సత్యంబాబును అరెస్ట్ చేశారు. అయితే సత్యంబాబును దోషిగా ప్రకటించిన న్యాయస్థానం అతనికి 14ఏళ్లు జైలు శిక్ష విధించింది. 

అయితే గత ఏడాది సత్యంబాబు నిర్దోషిగా నిర్ధారిస్తూ అతనిని విడుదల చేసింది. ఇటీవలే సత్యంబాబు వివాహం చేసుకుని తన భార్యతో జీవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయేషా మీరా హత్య కేసులో దోషులు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. 

ఇకపోతే 2018 నుంచి అయేషా మీరా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే విచారణలో భాగంగా శనివారం అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే.  

ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభం

Follow Us:
Download App:
  • android
  • ios