గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ కామాంధుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను నిరసిస్తూ మాచర్లలో బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్థులు బుధవారం నాడు రాస్తారోకోకు పాల్పడ్డారు.

గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటకు చెందిన మిర్యాల జయరావు అనే వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  అత్యాచారానికి పాల్పడిన జయరావు పరారీలో ఉన్నాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో  ఆమెను కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని  అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మాచర్లలో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. బాలిక పరిస్థితి మెరుగ్గా ఉందని  వైద్యులు చెబుతున్నారు.