Asianet News TeluguAsianet News Telugu

పగ తీర్చుకోవడానికి ఇదా టైం... జగన్ ఏం మారలేదు: రమేశ్ తొలగింపుపై పవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపుపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్ధితుల్లో ప్రభుత్వం తన శక్తిసామర్ధ్యాలను ప్రజలను కాపాడటంపై కేంద్రీకరించాలని పవన్ మండిపడ్డారు. 

janasena chief pawan kalyan reacts ap govt removing sec ramesh kumar
Author
Amaravathi, First Published Apr 10, 2020, 9:28 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపుపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్ధితుల్లో ప్రభుత్వం తన శక్తిసామర్ధ్యాలను ప్రజలను కాపాడటంపై కేంద్రీకరించాలని పవన్ మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలో ఇలా పేర్కొన్నారు. ‘‘ కక్షసాధింపు, మొడివైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మరోసారి వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని జగన్ తెలిపారు.

Also Read:జగన్ స్పీడ్: ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌గా రామసుందర రెడ్డి నియామకం..?

ముఖ్యమైన విషయాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయి. వీటన్నింటిలోనూ హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకుంటున్నా ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’’ అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వం వ్యవహారం.

ఎలక్షన్ కమీషనర్‌ను తొలగించడానికి ఇదా సమయం...? ఒక వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం తన శక్తిసామర్ధ్యాలను ప్రజలను కాపాడటంపై కేంద్రీకరించాలి.

ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోపోయారు.? కరోనా పడగ విప్పుతున్న సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడివుండేవో ఊహించగలమా..? దేశం ఆపత్కాలంలో ఉన్నందున ఈ సమయంలో రాజకీయాలు చేయరాదని జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోంది.

Also Read:మడమ తిప్పని వైఎస్ జగన్: ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు ఉద్వాసన

మీరు తీసుకుంటున్న ఇటువంటి కక్ష సాధింపు నిర్ణయాల కారణంగా..? ఈ నియంత్రణను దాటి మీ చర్యలను ఖండించవలసిన పరిస్ధితిని మీరే సృష్టించారు. జనసేన కోరుకుంటున్నది ఒక్కటే.. ఇది ప్రజలను కాపాడే సమయం. మీ కార్యాచరణ ఆ దిశగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 

కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది. 

janasena chief pawan kalyan reacts ap govt removing sec ramesh kumar

Follow Us:
Download App:
  • android
  • ios