టీడీపీకి జనసేన కౌంటర్.. రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్..

టీడీపీకి జనసేన కౌంటర్ ఇచ్చింది (Jana Sena gave a counter to TDP). రెండు స్థానాల్లో తమ పార్టీ చేయబోతోందని ప్రకటించింది. చంద్రబాబు నాయుడికి ఉన్నట్టే తనకు కూడా ఒత్తిడి ఉందని చెబుతూ రాజానగరం, రాజోలు స్థానాలకు పవన్ కల్యాణ్ అభ్యర్థులను (Pawan Kalyan announces candidates for Rajanagaram and Rajolu seats) ప్రకటించారు. 

Jana Sena's counter to TDP Pawan Kalyan has announced candidates for two seats.ISR

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మిత్రపక్షాలుగా ఉండి, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న టీడీపీ - జనసేనల మధ్య విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల టీడీపీ ఏకపక్షంగా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తనపై ఒత్తిడి ఉందని చెబుతూ మండపేట, అరుకు అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే దీనిపై జనసేన తాజాగా స్పందించింది. తమ పార్టీ కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని చెబుతూ వారి పేర్లను ప్రకటించింది. 

‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’.. అంటూ కేటీఆర్ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించి అన్నారో ?

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. టీడీపీ ఏకపక్షంగా రెండు స్థానాలకు అభ్యర్థలను ప్రకటించడం సరికాదని అన్నారు. లోకేష్ కాబోయే సీఎం చంద్రబాబు అంటూ మాట్లాడినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను మౌనంగా ఉన్నానని అన్నారు. కానీ ఇప్పుడు తనపై కూడా ఒత్తిడి ఏర్పడుతోందని, అందుకే రిపబ్లిక్ డే రోజు రెండు స్థానాలకు ‘ఆర్ఆర్ఆర్’లాగా అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పారు. 

నా తండ్రి వైఎస్ఆర్.. మరి నేను వైఎస్ షర్మిల ఎలా కాను - ఏపీసీసీ చీఫ్

ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ ప్రకటన చేయాల్సి వస్తోందని పవన్ కల్యాన్ అన్నారు. రాజానగరం స్థానం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన నుంచి బరిలో ఉండబోతున్నారని చెప్పారు. అలాగే రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు, వరప్రసాద్, డీఎంఆర్ శేఖర్ లు పరిశీలనలో ఉన్నారని చెప్పారు. ఈ రెండు స్థానల్లో జనసేన బరిలో నిలవబోతోందని చెప్పారు. కొందరు తనకు ఏమీ తెలియదు అని అనుకుంటున్నారని, 50 లేదా 60 తీసుకోండి అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని చెప్పారు. 

అన్నయ్య ప్రతీ పాత్రను, సినిమాను మనసు పెట్టి చేశారు - పవన్ కల్యాణ్

ఇవేమీ తెలియకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని అనుకుంటున్నారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తమ పార్టీ ఒంటరిగా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయంలో తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేశామని అన్నారు. 18 లక్షల ఓట్లు సంపదించామని చెప్పారు. అయితే ఒంటరిగా వెళ్తే సీట్లు గెలవచ్చేమో గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పారు. 

పొత్తు ధర్మం పాటించాలి.. టీడీపీ ఏకపక్షంగా సీట్లు అనౌన్స్ చేయకూడదు - పవన్ కల్యాణ్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు జనసేనను వదలడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. సొంత చెల్లినే వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు ఊరంతా శతృవులే ఉన్నారని అన్నారు. వైసీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలని సూచించారు. జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios