వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భద్రతా చర్యలపై వివాదం మొదలైంది. పాదయాత్రకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినంత పోలీసు భద్రతను కల్పించకపోవటంపై వైసిపి నేతలు మండిపడుతున్నారు. అందులోనూ గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే వివాదం ముసురుకోవటం గమనార్హం.

ఎందుకంటే, నరసరావుపేట నియోజకవర్గం స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుది కావటమే ఇంత రాద్దాంతానికి కారణం. స్పీకర లేదా కొడుకు కోడెల శివరామకృష్ణ ఆదేశాలతోనే పోలీసు భద్రతను ప్రభుత్వం తగ్గించేసిందని వైసిపి ఆరోపిస్తోంది.

జగన్ జడ్ క్యాటగిరి భద్రతున్న నేత అన్న విషయం అదరికీ తెలిసిందే. జడ్ క్యాటగిరి నేతకు ఏర్పాటు చేయాల్సినంత భద్రత కూడా కల్పించలేదా అంటూ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పాదయాత్రలో భద్రతను తగ్గించేసిందన్న ఆరోపణలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.