కొత్తగా కడుతున్న ఇళ్లకు దిష్టి తగలకుండా ఉండాలని ఆ ఇంటి యజమానులు.. తమ ఇళ్లకు హీరోయిన్ల సెక్సీ ఫోటోలను ఫ్లెక్సీలను తయారు చేసి వేలాడ దీశారు. ఈ సంఘటన అమరావతిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒకప్పుకు కొత్తగా ఇళ్లు కట్టుకుంటే దిష్టి తగలకుండా ఉండేందుకు గుమ్మడికాయ, రాక్షసుడి బొమ్మ లాంటివి పెట్టేవారు. దిష్టి ఇంటి మీదకు కాకుండా అవి ఆపుతాయని భావించేవారు. అయితే... అమరావతిలోని కొందరు ఇంటి యజమానులు మాత్రం చాలా కొత్తగా ఆలోచించారు. 

టాలీవుడ్ హీరోయిన్లు అనుష్క, హెబ్బా పటేల్ సెక్సీగా ఉన్న ఫోటోలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలుగా చేయించి తమ కొత్త ఇంటికి వేలాడదీశారు. దీంతో.. అటుగా వెళ్లే జనాలంతా ఈ హీరోయిన్ల ఫోటోలను చూస్తుండటం విశేషం. ఆ హీరోయిన్ల ఫోటోలు కూడా ఎక్స్ పోజింగ్ ఎక్కువగా చేస్తున్న ఫోటోలు పెట్టారు. 

ఇలా ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే.. హీరోయిన్లు అందంగా ఉంటారు కాబట్టి.. తమ ఇంటిని చూడకుండా వాళ్ల ఫోటోలు చూస్తారని..అప్పుడు తమ ఇళ్లకు దిష్టి తగలదని చెబుతున్నారు.

గతంలో నెల్లూరులో కూడా ఒక రైతు ఇలానే చేశాడు. తన పంటకు దిష్టి తగలకుండా ఉండాలని పొలంలో సన్నీలియోన్ ఫోటోలను ఫ్లెక్సీలు కట్టాడు. అప్పట్లో ఈ వార్త  తీవ్ర సంచలనం రేపింది.