Asianet News TeluguAsianet News Telugu

ఐటి సోదాలు: నారా లోకేష్ తో కిలారి రాజేశ్ కు లింక్స్?

ఇటీవల కిలారి రాజేశ్ అనే వ్యక్తి నివాసంలో ఐటి సోదాలు జరిగిన విషయం తెలిసిందే. కిలారి రాజేశ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

I-T searches bring focus on key aide of Nara Lokesh
Author
Hyderabad, First Published Feb 13, 2020, 11:43 AM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, ఆయన తనయుడు నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులైనవారిపై ఆదాయం పన్ను (ఐటీ) దాడులు జరిగాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస రావు నివాసంలో దాదాపు ఐదు రోజుల పాటు ఐటి సోదాలను జరిగిన విషయం తెలిసిందే.

ఆ క్రమంలోనే నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారి రాజేశ్ పేరు కూడా తెర మీదికి వచ్చింది. రాజేశ్ నివాసంపై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. మిత్రుడు అభీష్ట నారా లోకేష్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఆయన దూరమైన తర్వాత కిలారి రాజేశ్ నారా లోకేష్ కు దగ్గరయ్యారు. 

Also Read: చంద్రబాబు కోటరీ: వారికి చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్

2014 ఎన్నికల్లోనే కాకుండా 2019 ఎన్నికల్లో కూడా కిలారి రాజేశ్ టీడీపీ వార్ రామ్స్ ను నిర్వహించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేశ్ పవర్ సెంటర్ గా అవతరించారు. 

నిర్వాణ హోల్డింగ్ కంపెనీకి రాజేశ్ పూర్తి కాలం డైరెక్టర్. అందులో చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రాహ్మణి డైరెక్టర్లుగా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫిన్ లీజ్ లిమిటెడ్, హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన బోర్డుల్లో కూడా రాజేసశ్ ఉన్నాడు. 

Also Read: చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న సోదాలు

రాజేశ్ అమెరికాలోని పిట్స్ బర్గ్ సమీపంలో గల రాబర్ట్ మోరిస్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. వాణిజ్య విశ్లేషణ, డెబిట్ సిండికేషన్, స్ట్రాటజిక్ అక్విజిషన్ ల్లో రాజేశ్ ది అందె వేసిన చేయి అంటూ వార్తాకథనాలు వస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios