విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు తుపాకి పేలి హోం గార్డు భార్య మరణించింది. భార్యకు సరదాగా హోం గార్డు వినోద్ తూపాకి చూపించాడు. ఆ సమయంలో అది మిస్ ఫైర్ అయింది. దాంతో హోం గార్డు భార్య సూర్యరత్నప్రభ అక్కడికక్కడే మరణించింది. 

ఈ సంఘటనపై భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు వద్ద పేలిన తుపాకి ఏఎస్పీది. హోంగార్డు, ఎఎఎస్పీ మూడు రోజుల క్రితం అనంతపురం పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఎఎస్పీ తన తుపాకిని హోంగార్డు వద్ద పెట్టాడు. 

అయితే, ఏఎస్పీ తుపాకి హోంగార్డు వినోద్ వద్దనే ఉంది. దాన్ని భార్య సూర్యరత్నప్రభకు వినోద్ సరదా చూపించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అది మిస్ ఫైర్ అయింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఎఎస్పీ అసిస్టెంట్ గా వినోద్ పనిచేస్తున్నాడు.