పల్లెబాటలో బాలయ్య ఉంగరం మిస్.. వెతికి తెచ్చిన అభిమాని

First Published 29, Jun 2018, 1:10 PM IST
Hero balakrishna Ring missingn at Hindupur
Highlights

పల్లెబాటలో బాలయ్య ఉంగరం మిస్.. వెతికి తెచ్చిన అభిమాని

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఉంగరాన్ని పొగొట్టుకున్నారు.. తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకం కావాలని భావించిన బాలయ్య దీనిలో భాగంగా మూడు రోజుల పల్లె నిద్రను ప్రారంభించారు. తొలిరోజు చిలమత్తూరు మండలం చాగలేరు ఎస్సీ కాలనీలో పర్యటించారు. అనంతరం ఇవాళ పాతచామలపల్లిలో బాలకృష్ణ పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయనను చూసేందుకు ఫోటోలు దిగేందుకు అభిమానులు భారీగా గుమిగూడటంతో.. వారితో మాట్లాడే సమయంలో బాలకృష్ణ ఉంగరం కిందపడింది.. దీన్ని గమనించిన ఓ మహిళా అభిమాని కిందపడిన ఉంగరాన్ని వెంటనే ఆయన చేతికి తొడిగింది. ఆమె నిజాయితీకి మెచ్చుకున్న బాలకృష్ణ అభినందించారు.
 

loader