జగన్ పార్టీ నుంచి జంప్: భూమా అఖిలప్రియకు ఊరట

HC quashes petition filed against Akhila Priya
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియకు హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియకు హైకోర్టులో ఊరట లభించింది.  వైసీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరిన అఖిలప్రియకు మంత్రిగా కొనసాగే అర్హత లేదంటూ గిన్నే మల్లేశ్వరరావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. 

ఆ పిటిషన్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఇటువంటి వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని తెలిపింది. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే ఫిర్యాదులు స్పీకర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, ఆ వ్యవహారాలను వైసీపీ నేతలు చూసుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. 

అందువల్ల ఈ అంశంతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు హైకోర్టు తెలిపింది.. రాజ్యాంగంలోని 164(4) ఆర్టికల్‌ కూడా వర్తించబోదని న్యాయమూర్తులు జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎన్‌. బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తెలిపింది.

loader