అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మరికాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా... వరుడి ఇంటికి వచ్చిన గిఫ్ట్‌ పెళ్లి రద్దుకు కారణమైంది. వరుడికి గిఫ్ట్‌గా పంపిన సెల్‌ఫోన్‌లో వధువు నగ్నవీడియోలు ఉన్నాయి.దీంతో తాను ఈ వివాహం చేసుకోనని వరుడు తేల్చి చెప్పేశాడు. దీంతో  ఈ పెళ్లి రద్దైంది. వధువు కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన యువతిని  ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడికి ఇచ్చి ఈ నెల 7వ తేదీన వివాహం చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి.  

అయితే  కొద్ది క్షణాల్లో వివాహం జరగాల్సి ఉండగా  వరుడికి ఓ గిఫ్ట్ వచ్చింది.ఈ గిఫ్ట్ ‌ ప్యాకెట్‌లో సెల్‌ఫోన్ ఉంది.ఈ సెల్‌ఫోన్‌ను ఆన్ చేసి చూస్తే  వధువు స్నానం చేసి బట్టలు మార్చుకొంటుండగా తీసిన దృశ్యాలు ఉన్నాయి.  ఈ దృశ్యాలను చూసిన వరుడు షాక్‌కు గురయ్యాడు. 

వెంటనే కుటుంబసభ్యులకు చెప్పి తాను పెళ్లిని రద్దు చేయాలని కోరారు.  ఈ విషయమై వధువు కుటుంబసభ్యులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా అతను ఒప్పుకోలేదు. 

పెళ్లి రద్దు కావడంతో బాధిత కుటుుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు దగ్గరి బంధువైన  ఓ వ్యక్తి  ఈ వీడియోలు తీసి ఉంటాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  అయితే నిందితుడిని కాపాడేందుకు  అధికార పార్టీకి చెందిన  నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.