కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. మిత్రుడిని బంధించి యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. తాగిన మత్తులో వారు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

స్నేహితుడితో కలిసి ఓ యువతి సముద్ర తీరానికి వచ్చింది. తూర్పు గోదావరి ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి ెందిన యువతి (21)) 15 రోజుల క్రితం అల్లవరంలోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచచింది. 

ఆ సందర్భంగా ణె తన మిత్రుడితో కలిసి గొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలోి సముద్రతీరానికి వెళ్లింది. అప్పటికే మద్యం తాగిన మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు వారు కంట పడ్డారు. సీతారామపూరానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చారు. 

మిత్రుడిని బంధించి యువతిపై సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆ తర్వాత నగ్నంగా ఉన్న యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్ావత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. దాంతో బాధితురాలు బంధవులకు చెప్పింది. 

దాంతో వాళ్లు బుధవారంనాడు అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.