కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఓ యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. నగరంలోని రాగంపేట రెల్లివీధికి చెందిన బొబ్బిలి పృథ్వి తనకు సన్నిహితంగా ఉండే 19 ఏళ్ల యువతిని శనివారం అర్ధరాత్రి జనతా గ్యారేజ్‌ ఏరియాకు తీసుకెళ్లాడు. 

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అప్పటికే పృథ్వి స్నేహితులైన దలైయ్‌ శ్యామ్‌కుమార్‌, వాసుపల్లి సాయి, నీలాపు సాయికుమార్‌ అక్కడికి చేరుకున్నారు. వీరంతా కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

తీవ్ర అస్వస్థతకు గురైన యువతి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. సోమవారం ఉదయం తల్లి సాయంతో త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.