కట్ అండ్ పేస్ట్ లతో మార్చొచ్చు: ఎంపీల జోక్ లపై గంటా

Ghanta reacts on TDP MPs episode
Highlights

కట్ అండ్ పేస్ట్ ద్వారా మరో అర్థం వచ్చేలా మార్చవచ్చునని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు.

విశాఖపట్నం:  కట్ అండ్ పేస్ట్ ద్వారా మరో అర్థం వచ్చేలా మార్చవచ్చునని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం సిఎం రమేష్ చేస్తున్న దీక్షను తక్కువ చేసే విధంగా టీడీపీ ఎంపీలు జోకులు వేసుకున్న వీడియోపై ఆయన స్పందించారు. 

టీడీపి ఎంపీల రాద్దాంతంపై వాస్తవాలు బయటకు రావాలని ఆయన అన్నారు. ఉక్కు కర్మాగారం ఇచ్చి క్రెడిట్ బిజెపియే తీసుకోవచ్చునని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. సీఎం రమేష్ దీక్షపై అవాకులు చవాకులు సరికాదని ఆయన అన్నారు. దొంగదీక్షలు తమకు చేతకాదు..బీజేపీ నేతలకే అలవాటని ఆయన విమర్శించారు. 

దీక్షలకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించాలని చూస్తే క్షమించరని ఆయన అన్నారు. క్రెడిట్ కోసం దీక్షలు చేయడంలేదని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నేతలే క్రెడిట్ తీసుకుని ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కన్నాపై భౌతికదాడులు ప్రజాగ్రహానికి పరాకాష్ట ఆయన అన్నారు.  ఈ విషయంలో టీడీపిని తప్పు పట్టడంలో అర్థం లేదని అన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా బిజెపి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

 

loader