Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో 22 ఏళ్ల మహిళపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం, ముగ్గురు అరెస్ట్

అనారోగ్యంతో బాధపడుతున్న సోదరికి సాయం చేయడానికి వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

gang-rape on 22-year-old woman by nine in Nellore, three arrested - bsb
Author
First Published Jun 13, 2023, 10:43 AM IST

తిరుపతి : నెల్లూరు జిల్లా కొండాయపాలెం సమీపంలో శనివారం 22 ఏళ్ల యువతిపై తొమ్మిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి రాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కోవూరు మండలానికి చెందిన బాధితురాలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూసుకునేందుకు నగరానికి వచ్చిందని పోలీసులు తెలిపారు. మందులు కొనడానికి మెడికల్ స్టోర్‌కి వెళ్లడం కోసం గాంధీ విగ్రహం వద్ద ఆటో రిక్షా ఎక్కింది. డ్రైవరు ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆమె మీద అఘాయిత్యం జరిగింది.

"జూన్ 11 సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు స్వీకరించిన తరువాత, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం. విచారణలో భాగంగా..  వివిధ ప్రదేశాల నుండి సిసిటివి ఫుటేజీని విశ్లేషించాం. ఆటో రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించాం. దీంతో సోమవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగలిగాం" అని స్థానిక పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వ్యక్తులు దాసి సందేశ్ (26), దర్శి అశోక్ (22), అరవభూమి వంశీకృష్ణారెడ్డి (26)లుగా గుర్తించారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె ఆటో-రిక్షా ఎక్కిన తర్వాత, ఆటో డ్రైవర్ తన ముగ్గురు సహచరులను వాహనంలోకి ఎక్కించుకున్నాడు. ఆ తరువాత వారు ఆమెను దూరంగా తీసుకెళ్లారు. ఆమెను కొండాయపాలెంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. 

కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుని బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్..

కత్తులతో బెదిరించి ఈ ముఠా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కాలినడకన వెడుతున్న మరో ఇద్దరు,  బైక్‌పై వచ్చిన మరో ముగ్గురు కూడా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. పోలీసులు గస్తీ తిరుగుతూ అక్కడికి రావడంతో నిందితులు పారిపోయారు. ఈ దారుణం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె ధైర్యంగా ఆదివారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉండగా, జూన్ 1న ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటనే వెలుగు చూసింది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు కాలిన గాయాలకు గురైంది. దీంతో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం నాడు ప్రాణాలు విడిచింది. అత్యాచారానికి ఎదురు తిరగడంతో ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు దుర్మార్గులు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తండ్రి ఆస్పత్రిలో చేర్పించడంతో రెండు నెలలుగా ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని గుజరాత్ లోని సూరత్ కు తీసుకువెళ్లారు. మరోవైపు విద్యార్థిని కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

మహావీర్ మీద అనుమానం ఉందని.. తన  కూతురు అదృశ్యానికి అతనికి సంబంధం ఉండొచ్చని తెలపడంతో.. అతను, అతని స్నేహితుల మీద.  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మార్చి 28న మహావీర్ అతని స్నేహితులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఎదురు తిరిగింది. కోపానికి వచ్చిన నిందితుడు ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

ఆ తర్వాత ఈ విషయాన్ని విద్యార్థినిని కిడ్నాప్ చేసిన  మహా వీరే  స్వయంగా బాధితురాలు తండ్రికి ఫోన్ చేశాడు. అతని కూతురు తీవ్ర గాయాల పాలయిందని తెలిపాడు. దీంతో మార్చి 29న బాధితురాలు తండ్రి సుల్తాన్పూర్ ఎస్పీ సోమన్ వర్మను కలిసి.. ఘటన మొత్తాన్ని వివరించాడు.  దీంతో వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సూరత్ వెళ్లారు. అక్కడ  మహావీర్ చెప్పిన గుర్తుల ప్రకారం బాధితురాలి ఆచూకీ కనుక్కుని.. ఆమెను లఖ్ నవూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా మారి గాలించారు.  వీరిలో ప్రధాన నిందితుడైన మహావీర్.. అతని స్నేహితుడైన ధనిరామ్ లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటినుంచి  60 శాతానికి పైగా  కాలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతుంది. మంగళవారం రాత్రి  మృతి చెందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios