విశాఖపట్నం: మైనర్ బాలికను అవకాశాల ఆశచూపి లోబర్చుకుని గర్భవతిని చేసిన యూట్యూబ్ స్టార్, ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14ఏళ్ల మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి భార్గవ్ మానభంగం చేసినట్లు దిశ ఎసిపి ప్రేమకాజల్ తెలిపారు.

ఈ అత్యాచారం కేసు వివరాలను ఎసిపి వివరించారు.  టిక్ టాక్ తో పాటు ఇతర మీడియాలో అవకాశాలు ఇప్పిస్తానని 14 ఎళ్ళ మైనర్ బాలిక ను భార్గవ్ లైంగికంగా వాడుకున్నాడని తెలిపారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని  వెంటపడ్డాడని... ఆమె నో చెప్పిన వినకుండా దుస్తులు మార్చుకుంటున్న ఫోటోలు ఉన్నాయంటు బెదిరించి లోబరుచుకున్నాడని ఏసిపి వెల్లడించారు. 

ఇలా సోషల్ మీడియాలో పాపులర్ చేస్తామంటే నమ్మవద్దని యువతులకు సూచించారు ఏసిపి. ఎవరైన అత్యాచారానికి గురయిన మైనర్ బాలిక ఎవరు... ఎక్కడ ఉంటుంది... ఏం చేస్తుంది... అంటు వివరాలు కోసం షోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దిశ ఏసిపి హెచ్చరించారు. 

వీడియో

మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన భార్గవ్ ని వైజాక్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు అతనిపై పోక్సో(ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్స్ అబ్యూస్) యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు.