ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి గంటా లేఖ: రాజీనామా ఆమోదించాలని వినతి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.
అమరావతి: మాజీ మంత్రి Ganta Srinivasa Rao ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు సోమవారం నాడు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో స్పీకర్ ను కోరారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన MLA పదవికి 2021 ఫిబ్రవరి 12వ తేదీన రాజీనామా చేశారు. ఈ రాజీనామాను Speaker ఇంకా ఆమోదించలేదు.
అయితే ఈ రాజీనామాను ఆమోదించాలని కూడా గతంలో శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ Tammineni Sitaram ని కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు కోరారు.
Visakha స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను మీడియా ప్రతినిధులకు అందించారు. ఆ తర్వాత రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని కూడా ఆయన కోరారు. YC{P ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని కూడా కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీకి ఏడాదికి చేరుకొన్నాయి.
జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను ప్రభుత్వం కేటాయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం అలంటి పనులు చేయడంలేదు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఈ కారణంగానే గత కొన్నేళ్లుగా సంస్థ నష్టాలను నమోదు అవుతున్నాయి. వాటిని సాకుగా చూపించిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పూర్తిగా వదిలించుకోవాలని చూస్తోంది.
నిజానికి 2015 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఉక్కు పరిశ్రమలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఐరన్ ఓర్ ప్రైవేటుగా కొనుగోలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. 2015-16 నుంచి 2020 మధ్య 5వేల కోట్లు వరకు నష్టం వచ్చిందని కేంద్రం అంటుంది. ప్లాంట్ ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.
దేశంలో స్టీల్‌కు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తులో మళ్లీ లాభాల బాటపట్టే అవకాశం ఉంది. కానీ సరిగ్గా ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి సంస్థను అమ్మేస్తామనడం సరికాదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రులు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. 1971లో ఈ సంస్థ కోసం 64 గ్రామాల నుంచి దాదాపు 26 వేల ఎకరాల భూమి సేకరించారు. కురుపాం జమీందార్ 6వేల ఎకరాలు విరాళంగా ప్రకటించారు. ఆ భూములు ఇచ్చిన కుటుంబాల్లో సగం మందికే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు.. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అది అందరిదీ అనే అభిప్రాయంతో ప్రజలు సర్దుకుపోయారు. ప్రతీ ఏటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి టాక్స్‌ల రూపంలో వేలకోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. అయినప్పటికీ నష్టాల వంక చూపి స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని కేంద్రం చూస్తుంది .