ఎస్వీబీసీ ( శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌)లో పోర్న్ వీడియోలు దర్శనం ఇవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది.

మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. తొలగించిన వారిలో వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. ఇక షోకాజ్ నోటీసులు అందుకున్నవారిలో ఛానెల్ మేనేజర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.

కాగా, నెల రోజుల క్రితం ఓ కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్‌ సైట్‌ వీడియోను పంపాడు. దీంతో అవాక్కైన ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు.

దాంతో వారు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోర్న్‌ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అలాంటి సైట్లు చూస్తున్న ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించిన సంగతి తెలిసిందే.