మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ బీట్ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొలుత అనారోగ్యం కారణంగా ఏనుగు మృతి చెందిందని భావించినప్పటికీ..  మగ ఏనుగు లైంగిక దాడి వల్లే ఏనుగు మరణించిందని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. కాగా మృతి చెందిన ఏనుగుతో పాటు మరో పిల్ల ఏనుగు ఉండేదని అది ఎక్కడికి వెళ్లిందో తెలియలేదని వాచర్లు తెలిపారు.