Asianet News TeluguAsianet News Telugu

రమేశ్ 5 కోట్లమందిని కాపాడారు.. జగన్‌ది దుర్మార్గం: ఆ నిర్ణయం చెల్లదన్న దేవినేని

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ రమేశ్‌ కుమార్‌పై వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. ఎస్ఈసీ‌పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదని.. జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు

Ex minister devineni umamaheshwar rao slams ys jaganmohan reddy over ap govt removing sec ramesh kumar
Author
Amaravathi, First Published Apr 10, 2020, 6:14 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ రమేశ్‌ కుమార్‌పై వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. ఎస్ఈసీ‌పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదని.. జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. క

రోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను ఎస్ఈసీ రమేశ్ కుమార్ కాపాడారని దేవినేని ప్రశంసించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌లు కోర్టులో నిలబడవని.. మాస్క్‌లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని ఉమా ధ్వజమెత్తారు.

Also Read:మడమ తిప్పని వైఎస్ జగన్: ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు ఉద్వాసన

ఉద్యోగులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది. 

గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ రెండు జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

Also Read:ఏపీలో లాక్‌డౌన్ పొడిగింపు: సీఎంకు ఆ ఉద్దేశ్యం లేదన్న విజయసాయిరెడ్డి

తనకు రక్షణ కల్పించాలంటూ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా వైఎస్ జగన్ కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా ఆయన తన కార్యాలయాన్ని హైదరాబాదులో కేటాయించిన భవనానికి మార్చుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసపై రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios