Asianet News TeluguAsianet News Telugu

మండలి ఛైర్మన్ కి పాదాభివందనం చేసిన అచ్చెన్నాయుడు

మండలి ఛైర్మన్ షరీఫ్ ను వైసీపీ ప్రభుత్వం అవమానించిందని తెలిసి ఆయన ఇంటికి అచ్చెన్న వెళ్లారు. స్వయంగా ఆయన షరీఫ్ ను పరామర్శించారు. ఈ క్రమంలో షరీఫ్ పాదాలకు అచ్చెన్నాయుడు నమస్కరించడం గమనార్హం.
 

ex minister atchannaidu visits Mandali Chairman Sharif House
Author
Hyderabad, First Published Jan 23, 2020, 11:33 AM IST

శాసన మండలిలో బుధవారం మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే... మంత్రులంతా తాగి మండలికి వచ్చారని... మాజీ మంత్రి లోకేష్ పై దాడి చేయాలని ప్రయత్నించారని...మండలి ఛైర్మన్ ని అవమానించారంటూ యనమల మీడియా ముందు వివరించిన సంగతి తెలిసిందే. కాగా... మండలిలో జరిగిన దానికి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

మండలి ఛైర్మన్ షరీఫ్ ను వైసీపీ ప్రభుత్వం అవమానించిందని తెలిసి ఆయన ఇంటికి అచ్చెన్న వెళ్లారు. స్వయంగా ఆయన షరీఫ్ ను పరామర్శించారు. ఈ క్రమంలో షరీఫ్ పాదాలకు అచ్చెన్నాయుడు నమస్కరించడం గమనార్హం.

Also Read మండలికి తాగి వచ్చారు.. యనమల షాకింగ్ కామెంట్స్...

‘‘నన్ను దూషించినందుకు నేనేమీ బాధపడటం లేదు. రాజకీయాల్లో ఇలాంటివి సహజం’’ అని చైర్మన్‌  షరీఫ్.. అచ్చెన్నతో అన్నారు. అంత గొడవ జరిగినా షరీఫ్  హుందాగా వ్యవహరించిన తీరు అచ్చెన్నాయుడుని ఆకర్షించింది. వెంటనే  ఆయనకు అచ్చెన్న పాదాభివందనం చేశారు. ‘‘చాలా ఒత్తిడిని తట్టుకొని మీరు నిర్ణయం తీసుకొన్నారు. లక్షలాది మంది గుండెల్లో మీరు ఉంటారు’’ అని అచ్చెన్న ఈ సందర్భంగా  అన్నారు.

ఇదిలా ఉండగా శాసనసభ సమావేశాలను సర్కారు పొడిగించినప్పటికీ... తాము హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. ‘‘రాజధాని తరలింపు, సీఆర్డీయే రద్దు బిల్లుల కోసమే సభను ప్రత్యేకంగా సమావేశపరిచారు. వాటిపై నిర్ణయం వెలువడిన తర్వాత సభను మరోరోజు పొడిగించడంలో అర్థం లేదు. అందుకే గురువారం అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని టీడీపీ నేతలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios