కడప: కడప ఉక్కు కర్మాగార కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌ను సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, నిర్మాత బండ్ల గణేశ్ పరామర్శించారు.  ఎంపీ సీఎం రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా ఉక్కుదీక్షను కొనసాగించడం అభినందనీయమని లక్ష్మినరాాయణ అన్నారు. ఉక్కు కర్మాగారానికి కావాల్సిన అన్ని వనరులు జిల్లాలో ఉన్నాయని లక్ష్మినారాయణ అన్నారు. త్వరలోనే ఉక్కు కర్మాగారం వస్తుందని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
 
ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ పది రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శుక్రవారం ఉదయం రమేష్‌కు రిమ్స్ వైద్యులు పరీక్షలు చేశారు. ఆయనకు బీపీ, షుగర్ లెవల్స్ బాగా తగ్గాయని తెలిపారు. 

 ఎంపీ రమేష్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.